నర్సాపురంకు వందేభారత్ రాబోతుంది: కేంద్రమంత్రి
AP: ఈ నెల 15 నుంచి నర్సాపురంకు వందేభారత్ ట్రైన్ రాబోతుందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. వందేభారత్ చెన్నై నుంచి నర్సాపురం వరకు పొడిగించినట్లు చెప్పారు. ఆక్వా పరిశ్రమల కారణంగా జిల్లాలో మంచినీరు కలుషితం అవుతున్నాయని తెలిపారు. విజ్జేశ్వరం నుంచి అన్ని గ్రామాలకు మంచి నీరు అందించేందుకు శ్రీకారం చుట్టబోతున్నామని పేర్కొన్నారు.