హార్వర్డ్ అంశంపై వెనక్కి తగ్గిన ట్రంప్

హార్వర్డ్ వర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకునే అంశంపై US అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు అడ్డుకోవడంతో వర్సిటీలో ఉన్న 31 శాతం మంది విదేశీ విద్యార్థుల వివరాలు ఇవ్వాలంటూ మాట మార్చారు. వీరిలో US వ్యతిరేక దేశాల విద్యార్థులు ఉన్నారని.. చదువు కోసం వారు ఎలాంటి సొమ్ము చెల్లించటం లేదన్నారు. అలాంటి వారి వివరాలు తెలపాలని ఆదేశించారు.