పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

MBNR: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ గీతం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీ కృష్ణుడు గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. కాలనీలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా కట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సుధారాణి, ప్రిన్సిపల్ కృష్ణ పాల్గొన్నారు.