గుప్తనిధుల కోసం గుడినే తవ్వేశారు!
WGL: నల్లబెల్లి మండలం కన్నరావుపేట గ్రామంలోని పురాతన శివాలయంలో గుప్తనిధుల కోసం కొందరు దుండగులు తవ్వకాలు జరిపిన ఘటన కలకలం రేపింది. కొందరు రేకుల షెడ్ల పేరుతో గుడి ప్రాంగణంలో తవ్వకాలు చేపట్టారు. స్థానికులు ఈ విషయం తెలుసుకున్నారనే సమచారంతో దుండగులు అప్రమత్తమై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందిస్తారా లేదా అనే చర్చ గ్రామంలో కొనసాగుతోంది.