ఏడవ రోజుకు చేరిన పైడమ్మ జాతర ఉత్సవాలు
కృష్ణా: పెడన పట్టణంలో జరుగుతున్న శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు బుధవారం ఏడవ రోజుకు చేరుకున్నాయి. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పిల్లలను ఆకట్టుకుంటున్న రంగులరాట్నం, బ్రేక్ డాన్స్ వంటివి సంబరానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.