VIDEO: ‘వరి ధాన్యాన్ని గిట్టుబాటుకు కొనాలి’
KDP: చాపాడు మండల సర్వసభ్య సమావేశం గురువారం ఎంపీపీ లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన వరి పంటను ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్నారు. గ్రామ పంచాయతీల్లో ఖర్చుచేసిన బిల్లులను చెల్లించడంలో నిర్లక్ష్యం తగదన్నారు.