సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

MDK: తూప్రాన్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్, పూర్ణ రాజుగౌడ్, కృష్ణ గౌడ్, మన్నె శ్రీనివాస్, మల్లికార్జున గౌడ్ పాల్గొన్నారు.