మేయర్‌పై కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు

TG: HYD మేయర్ విజయలక్ష్మిపై నటి కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలో ఉన్న 1500 గజాల స్థలాన్ని ఆమె కొట్టేశారని చెప్పారు. మార్కెట్‌లో గజం రూ.2 లక్షల విలువ చేసే ఈ స్థలాన్ని, BRS ప్రభుత్వం గజం రూ.350 చొప్పున మేయర్‌కు కేటాయించిందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మేయర్ ఈ భూ దందాకు పాల్పడ్డారని కళ్యాణి మండిపడ్డారు.