ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

MDK: తూప్రాన్ పట్టణ పరిధిలోని పోతరాజుపల్లికి చెందిన వాకోడి శ్రీను (50) మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. శ్రీను గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడని సమాచారం. అనారోగ్యంతో ఉన్న కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లే విషయంలో భార్యతో గొడవ జరగడంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.