డిసెంబర్ 2న భద్రాద్రికి సీఎం రేవంత్
TG: వచ్చే నెల 2న సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వర్సిటీ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, సీఎం రేవంత్.. రేపటి నుంచి జిల్లాల పర్యటన ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.