రెండో రోజు 450 నామినేషన్లు
NZB: జిల్లాలో మొదటి విడతలో జరగనున్న GP ఎన్నికల్లో రెండో రోజు శుక్రవారం 184 సర్పంచ్ స్థానాలకు 164 నామినేషన్లు, 1,642 వార్డు మెంబర్ల స్థానాలకు 286 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.