కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ADB: ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశంలో మందిరంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని 268 చెక్కులను లబ్దిదారులకు అందించారు. ఈ మేరకు MLA మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల లబ్ది పొందడంలో అర్హులైన వారు మధ్య దళారులను నమ్మే అవసరం లేదన్నారు.