మా అణ్వాయుధ పరీక్షలు సరైనవే: కిమ్

మా అణ్వాయుధ పరీక్షలు సరైనవే: కిమ్

తమ అణ్వాయుధ పరీక్షలు సరైనవే అని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సమర్థించుకున్నారు. ఇరాన్ యుద్ధం వేళ దేశానికి బలమైన సైనిక నిరోధక శక్తి అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అమెరికా ఉగ్రవాదం, దండయాత్రలను చేస్తోందని కిమ్‌ మండిపడ్డారు. అయితే, ట్రంప్ పేరును ఆయన నేరుగా ప్రస్తావించలేదు. తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.