ఎదురెదురుగా కార్లు ఢీ.. గాయాలు
నెల్లూరు: వలేటివారిపాలెం మండలం హెరిటేజ్ పాల డైరీ సమీపంలోని హైవేపై మంగళవారం ఉదయం ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు ఉపాధ్యాయులతో పాటు నూకవరం గ్రామానికి చెందిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.