ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.