నూతన తహసీల్దార్‌గా రమాలక్ష్మీ పదవీ బాధ్యతలు స్వీకరణ
VZM: కొత్తవలస మండల తహసీల్దార్‌గా ఎస్. రమాలక్ష్మీ గురువారం ఇన్‌ఛార్జ్ తహసిల్దార్ పీ.సునీత నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడికి రాకముందు రాష్ట్ర ప్రధాన భూపరిపాలన విభాగంలో పనిచేస్తూ కొత్తవలసకు బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు మండల తహసీల్దార్ గా విధులు నిర్వహించిన అప్పలరాజు కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. భూసమస్యలపై దృష్టి సారిస్తానని రమాలక్ష్మీ చెప్పారు.