'మా ఊరు పేరు మార్చండి'
శ్రీకాకుళం: మెలియాపుట్టి మండలం పడ్డ పంచాయితీ పరిధిలో ఉన్న సాని పాలెం గ్రామం పేరును రామయ్య పాలెంగా మార్పు చేయాలని కోరుతూ తహసీల్దార్ బి పాపారావుకు గ్రామస్తులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. తమ స్వస్థలం సానిపాలెం తెలియజేయడానికి ఇబ్బందికి పడుతున్నామన్నారు. తమ గ్రామం పేరు వల్ల ఇతర ప్రాంతాలలో ప్రతికూల గుర్తింపు లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.