స్థిర ఆస్తులను అటాచ్ చేశాం: ఎస్పీ

VZM: ఎస్. కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన గంజాయి కేసులో అరెస్ట్ అయిన ఒడిస్సా వాసి నగేష్‌కు చెందిన ఆస్తులను అటాచ్ చేశామని SP వకుల్ జిందల్ ఇవాళ తెలిపారు. గంజాయి వ్యాపారంతో సంపాదించిన స్థిర, చరాస్తులను గుర్తించామని, రూ. 56 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేశామన్నారు. ఫ్రీజ్ చేసిన ఆస్తులు కోల్‌కత్తా ఆధారిటీ పరిధిలో ఉన్నాయని తెలిపారు.