ఆది పినిశెట్టి 'డ్రైవ్' టీజర్ రిలీజ్
ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో మలయాళ దర్శకుడు జేనూస్ మొహమ్మద్ తెరకెక్కించిన సినిమా 'డ్రైవ్'. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌ను చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా సెబాస్టియన్ నటిస్తోంది.