'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

MNCL: బెల్లంపల్లి మండల కేంద్రంలోని PHCని కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలు, ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు.