ప్రశాంతతకు ఆధ్యాత్మికతే మార్గం: ఎమ్మెల్యే కోవలక్ష్మి
ASF: ఆధ్యాత్మికతలోనే ప్రశాంతత లభిస్తుందని ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవలక్ష్మి అన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సాయంత్రం 5 గంటల నుంచి కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, దీపోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.