VIDEO: వినాయక చవితి ఉత్సవాలపై డీఎస్పీ సూచనలు

TPT: ప్రభుత్వ నిబంధనల మేరకు వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని గూడూరు డీఎస్పీ గీతా కుమారి నిర్వహకులకు సూచించారు. అనవసర హంగు, ఆర్భాటాలకు పోకుండా భక్తి భావంతో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. ఆదివారం డీఎస్పీ కార్యాలయ ఆవరణలో నిర్వాహకులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు.