'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'
KNR: శంకరపట్నం మండలంలోని కరీంపేట్ గ్రామంలో తాడికల్ సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శనివారం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.