సీలేరు ఏపీ జెన్‌కో ఈఈ సివిల్‌గా అప్పలనాయుడు
ASR: జీకేవీధి మండలం సీలేరు ఏపీ జెన్‌కో కార్యనిర్వాహక ఇంజనీర్ (ఈఈ సివిల్)గా టీ.అప్పలనాయుడు సోమవారం సీలేరు క్యాంప్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు ఏడీఈ నుంచి ఈఈగా పదోన్నతి కల్పిస్తూ (పంప్డ్ స్టోరేజ్ ఈఈగా), జెన్‌కో సీఎండీ ఇటీవల ఉత్తర్వులను జారీ చేశారు. ఈమేరకు ఆయన నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు ఏడీఈలు జైపాల్, చలపతిరావు అభినందించారు.