ఎమ్మెల్యే సామేలు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు
SRPT: తిరుమలగిరి మెయిన్ సెంటర్లో ఎమ్మెల్యే సామేలు దిష్టిబొమ్మను బీజేపీ శ్రేణులు దహనం చేశారు. గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో హిందూ ధర్మం పట్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కడియం రామచంద్రయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.