DEO ఆదేశాల మేరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

DEO ఆదేశాల మేరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

GDWL: ధరూర్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డీఈవో ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరం సెప్టెంబర్ మొదటి నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించడం మొదలు పెట్టారు. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాలను, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను, గ్రామీణ ప్రాంత పరిస్థితిని, ఎస్ఏ 1 పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలని తెలియజేశారు.