దేశ సంపద కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న పాలకులు
KMM: దేశ సంపదను పాలకులు కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని TUCI రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎల్. పద్మ అన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన రాజకీయ శిక్షణ తరగతుల్లో ప్రసంగించారు. కార్మిక చట్టాలపై పాలకులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, వాటి సంరక్షణకు ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కార్యదర్శి జి.రామయ్య, పి.రామదాసు ఉన్నారు.