ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులు.. అభ్యర్థుల్లో టెన్షన్..!
MBNR: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ముగియడంతో, ఇప్పుడు గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ క్రమం ప్రకారం గుర్తులు కేటాయించనున్నారు. ఓటర్లకు సులభంగా అర్థమయ్యే సాధారణ గుర్తులు వస్తే బాగుంటుందని, లేదంటే ఇబ్బంది కలుగుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు.