'మాజీ మంత్రిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి'

TPT: మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కోరారు. గురువారం ఆయన నాయుడుపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు.