VIDEO: ఇలాగే ఉంటే రోగాలు రావా?

VIDEO: ఇలాగే ఉంటే రోగాలు రావా?

NLG: కట్టంగూర్ మేజర్ గ్రామపంచాయతీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కల్మేర రోడ్డులో జంగాల కాలనీ దారిలో నిర్మించిన తాగునీటి ట్యాంకు వద్ద డ్రైనేజీ సక్రమంగా లేక మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తుందని స్థానికులు తెలిపారు. తాగునీటి వద్ద అపరిశుభ్రత గురించి పంచాయతీ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు.