డ్రగ్స్ రహిత సమాజమే మన అందరి లక్ష్యం: సీఐ

డ్రగ్స్ రహిత సమాజమే మన అందరి లక్ష్యం: సీఐ

NDL: డక్స్ రహిత సమాజమే మన అందరి లక్ష్యమని నంద్యాల టూ టౌన్ సీఐ ఆస్రర్ బాషా పేర్కొన్నారు. గురువారం నంద్యాల టౌన్ ఎస్పీ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. దేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. యువతీ యువకులు, విద్యార్థులు సెల్ ఫోన్, గుట్కా, డ్రగ్స్, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు.