నేడు మక్తల్‌కు రామజన్మ భూమి ట్రస్ట్ మెంబర్ రాక
NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలకు, అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ సభ్యుడు ఉడుపి పీఠాధీశ్వరులు విశ్వప్రసన్న తీర్థ శ్రీ పాదులవారు రానున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కుంభేశ్వర స్వామి ఆలయం నుంచి లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు.