ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

NLG: త్రిపురారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతీ సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ఆందోళనలో ఉన్న రైతులకు ఈ కేంద్రాల ఏర్పాటు ఊరటనిస్తుందన్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.