మిషన్ భగీరథ పైపు లీకేజీ.. నీరు కలుషితం
VKB: బంట్వారం నుంచి సల్బతాపూర్ వెళ్లే రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్ అవుతోంది. పొలాల్లో నీరు నిరంతరం వృథాగా పోతూ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిల్వ అయ్యి కలుషితం అవుతోంది. ఈ నీరు వినియోగించడం వల్ల అనారోగ్యాలకు దారి తీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీని వెంటనే సరిచేయాలని కోరుతున్నారు.