టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎంపీ

టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎంపీ

బాపట్లలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత టీడీపీదేనని, రాష్ట్ర అభివృద్ధి కేవలం తమ పార్టీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.