అద్దె బకాయి చెల్లించకపోవడంతో గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం
MHBD: జిల్లా సండ్రాలగూడెం గ్రామంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. గత నాలుగేళ్లుగా కార్యాలయ అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. ఉదయం పని కోసం వచ్చిన సిబ్బంది తాళం వేసి ఉండటంతో విస్మయానికి గురయ్యారు. ఈ ఘటన గ్రామంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.