ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా

ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా

NLG: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలో ఇవాళ ధర్నా నిర్వహించారు. తాలు, తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని సీపీఐ నాయకులు గురిజా రామచంద్రం, తీర్పారి వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు.