మిథున్ రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా
AP: బెయిల్ షరతులు సడలించాలన్న ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. మద్యం కేసులో మిథున్ రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు బెయిల్ షరతులు సడలించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరపున సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది.