VIDEO: ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే రేగా
BDK: కారకాగూడెం మండలం సమత్ భట్టుపల్లి పంచాయతీలోని 5 వార్డులో ఓటు హక్కు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటికీ ఒక్క హామీ నెరవేర్చడంలో విఫలం అయిందని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.