'విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం'

'విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం'

WGL: పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని TGNPDCL CMD వరుణ్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ఒక్క రోజులోనే 6,574 మెగావాట్ల విద్యుత్ నమోదైనట్లు ఆయన వెల్లడించారు. గురువారం 6,457 మెగావాట్ల రికార్డును అధిగమించి, కేవలం 24 గంటల్లోనే అదనంగా 117 మెగావాట్ల డిమాండ్ పెరిగిందన్నారు.