3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం

3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం

JN: జిల్లాలోని అన్ని మండలాల్లో బుధువారం నుంచి లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు మూడు నెలల బియ్యాన్ని రేషన్ డీలర్‌లు అందజేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 335 రేషన్ దుకాణాలల్లో 5,64,657 మంది లబ్ధిదారులకు ఈ పంపిణీ జరగనుంది. లబ్ధిదారులు మళ్లీ జూలైలో మాత్రమే బియ్యం దుకాణాలకు రానున్నారు.