నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు ప్రకటనలో తెలిపారు. లైన్ AB స్విచ్ ఎరెక్షన్ పనుల కోసం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సర్ సిల్క్, గుంటూరు కాలనీ, LBS మార్కెట్ పరిధిలో విద్యుత్ భద్రత, నిర్వహణ కారణంగానే ఈ సరఫరా నిలిపివేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.