డీజీపీ ఎదుట 42 మంది మావోయిస్టులు లొంగుబాటు
HYD: డీజీపీ ఎదుట 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. ఇందుతో 11 మంది PLGA బెటాలియన్ సభ్యులు ఉన్నారు. బెటాలియన్ డిప్యూటీ కమాండర్ సోది కేశాలె లొంగుబాటును పోలీసులు విజయంగా భావిస్తున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. లొంగిపోయిన వారిలో ఒక్కరు మినహా మిగిలిన వారంతా ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందినవారేనని స్పష్టం చేశారు. గత ఏడాదిన్నరలో 763 మంది లొంగిపోయారన్నారు.