బాపట్లలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు
బాపట్ల శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. వక్తలు గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలని, యువత మొబైళ్లకు దూరంగా ఉండి పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ క్రమంలో వివిధ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.