బాన్సువాడలో రాత్రి ముమ్మరంగా తనిఖీలు

బాన్సువాడలో రాత్రి ముమ్మరంగా తనిఖీలు

KMR: ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణ సీఐ తుల శ్రీధర్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి బస్టాండ్‌లో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల లగేజీలు, వాహనాల్లో సోదాలు చేశారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ ప్రజలకు సూచించారు.