బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: డీఎఫ్ఓ

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: డీఎఫ్ఓ

CTR: సోమల మండలం కొత్తూరులో ఏనుగుల దాడిలో మృతి చెందిన రామకృష్ణంరాజు కుటుంబానికి అండగా ఉంటామని డీఎఫ్ఓ భరణి తెలిపారు. బాధితుడు మృతి చెందిన సంఘటనా స్థలాన్ని ఆదివారం ఆమె పరిశీలించారు. అటవీ సరిహద్దు ప్రాంతాలలో పొలాలు ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కొద్ది రోజులు సాయంత్రం పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించారు.