పాక్ కాల్పులు.. సరిహద్దులో హై అలర్ట్

పాక్ కాల్పులు.. సరిహద్దులో హై అలర్ట్

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉరి, కుప్పారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జైసల్మేర్, ఉరిలో సైరన్లు మోగడంతో బ్లాక్ అవుట్ ప్రకటించారు. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్ కాల్పులను తిప్పికొడుతున్నాయి. దీంతో జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.