VIDEO: పాఠశాలకు అదనపు భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
ASR: రాజవొమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించనున్న అదనపు భవనానికి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ.69 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న మూడు అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఎంపీపీ గోము వెంకటలక్ష్మి కూటమి నాయకుల తదితరులు పాల్గొన్నారు.