టీ.డీ. గుట్ట ప్రాంతంలో చిరుత సంచారం

MBNR: జిల్లాలోని టీ.డీ. గుట్ట ప్రాంతంలో ప్రజలు గుట్ట మీద చిరుతపులిని చూశామని పేర్కొన్నారు. చిరుత తమ నివాస ప్రాంతాల్లోకి వచ్చిందని తెలిపారు. దీంతో బయపడిన ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన ఫారెస్ట్ వారు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.