'పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి'
SRCL: తంగళ్ళపల్లి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఇంచార్జ్ కలెక్టర్ పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే రాళ్ళపేట గ్రామంలోని మండల పరిషత్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? విద్యార్థులకు అందిస్తున్న బోధన, మౌలిక సదుపాయాల తీరుపై ఆమె ఆరా తీశారు.